స్పందించిన (డాక్సిన్ టైమ్స్) నవంబర్ 02
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు 2 డబల్ బెడ్ రూమ్ కాలనీ వాసులు తమ నివాసాల వద్ద పేరుకుపోయిన చెట్లు, పొదల సమస్యలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వెంటనే జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు 2 డబల్ బెడ్ రూమ్ కాలనీ వాసులు తమ నివాసాలలో ఉన్న సమస్యలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్, వెంటనే మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయడంతో, మున్సిపల్ అధికారులు శానిటేషన్ కార్మికులతో జేసీబీని పంపించి, ఏపుగా పెరిగిన చెట్లు, పొదలను తొలగించారు. ఈ సందర్భంగా 2 డబల్ బెడ్ రూమ్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్, బ్రహ్మం మాట్లాడుతూ, రామేశ్వరపల్లి కాలనీలోని 2 నివాసాలలో ఉన్న సమస్యలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ కు సూచనలు చేశారని తెలిపారు. మున్సిపల్ అధికారులు శానిటేషన్ కార్మికులతో కలిసి జేసీబీ సహాయంతో మురికి కాలువలు, డ్రైనేజీలలోని పొదలను తొలగించి, పరిశుభ్రత చేయించినందుకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.












