కామారెడ్డికి చెందిన ప్రముఖ విద్యావేత్త, ఆర్కే గ్రూప్ సీఈఓ, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. క్రీడారంగంలో ఆయన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి. మల్లారెడ్డి తెలిపారు.
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కామారెడ్డికి చెందిన ప్రముఖ విద్యావేత్త, ఆర్కే గ్రూప్ సీఈఓ, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి నియమితులయ్యారు. క్రీడారంగంలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి. మల్లారెడ్డి అధికారికంగా వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చైర్మన్‌గా, మాజీ మంత్రి వేణుగోపాల్ చారి వైస్ చైర్మన్‌గా, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న అడ్వైజరీ కమిటీలో కామారెడ్డి నుంచి జైపాల్ రెడ్డికి చోటు దక్కడం జిల్లా క్రీడా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.












