హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్ (ఐఎఫ్ఎల్) 202627 సీజన్‌ను విజయంతో ప్రారంభించింది. ఆదివారం జైపూర్‌లోని విద్యాధర్ నగర్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ యునైటెడ్ ఎఫ్‌సీపై 10 తేడాతో గెలుపొందింది. నిషు కుమార్ 66వ నిమిషంలో సాధించిన ఏకైక గోల్‌తో జట్టు మూడు పాయింట్లు సాధించింది.
మ్యాచ్ ప్రారంభంలో రాజస్థాన్ యునైటెడ్ దూకుడుగా ఆడింది. తమ వింగర్ల వేగంతో శ్రీనిధి డెక్కన్ రక్షణశ్రేణిపై ఒత్తిడి పెంచింది. అయితే అనుభవజ్ఞులైన ప్రీతమ్ కోటల్, హాది ఇద్రిస్సూ నేతృత్వంలోని డెక్కన్ డిఫెన్స్ ప్రత్యర్థి దాడులను సమర్థంగా అడ్డుకుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
శ్రీనిధి డెక్కన్‌కు కూడా గోల్ చేసే అవకాశాలు లభించాయి. అడ్రియానో కాస్టాన్హేరా అందించిన బంతిని జెర్రీ మావిహ్మింగ్తంగా గోల్‌గా మలచలేకపోయాడు. మరోవైపు డేవిడ్ కాస్టానెడా కొట్టిన షాట్ క్రాస్‌బార్‌ను తాకడంతో డెక్కన్‌కు తొలి అర్ధభాగంలో ఆధిక్యం దక్కలేదు. దీంతో ఇరు జట్లు గోల్స్ లేకుండానే విరామానికి వెళ్లాయి.












