రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా అశ్వాపురం ఎస్ఐ భూక్యా శాంతి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో పోలీసు సిబ్బందితో కలిసి వాహనదారులను తనిఖీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, అశ్వాపురం, నవంబర్ 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, అశ్వాపురం, నవంబర్ 1: రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా అశ్వాపురం ఎస్ఐ భూక్యా శాంతి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో పోలీసు సిబ్బందితో కలిసి వాహనదారులను తనిఖీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రమాదకర చర్యగా డ్రంక్ అండ్ డ్రైవ్
ఈ సందర్భంగా ఎస్ఐ భూక్యా శాంతి మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపడం కేవలం వ్యక్తిగత తప్పిదం మాత్రమే కాదని, రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టే చర్య అని ఆమె హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

