బెంగళూరు విమానాశ్రయంలోని ఓ రెస్టారెంట్లో శాకాహార బిర్యానీ ఆర్డర్ చేసిన కుటుంబానికి అందులో చికెన్ ముక్కలు కనిపించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వారణాసికి చెందిన పీయూష్ అగర్వాల్ తన కుటుంబంతో కలిసి ప్రయాణం చేస్తూ విమానాశ్రయంలోని టేస్ట్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్లో భోజనం చేసేందుకు వెళ్లారు. గేట్లు 16-17 సమీపంలోని ఈ రెస్టారెంట్లో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. బిల్లులోనూ శాకాహార బిర్యానీగా నమోదైంది. అయితే భోజనం చేస్తుండగా అందులో చిన్న చిన్న చికెన్ ముక్కలు కనిపించాయని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కుటుంబం పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటుందని, పిల్లలు కూడా తెలియకుండానే ఆ మాంసాహార ముక్కలను తిన్నారని పీయూష్ తెలిపారు. ఈ ఘటన తమను తీవ్రంగా బాధించిందని, తమ ఆహారపు అభిరుచులు, మతపరమైన భావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.












