కడప నగరంలో త్వరలో జరగనున్న పిఆర్ఎస్ వైఎఫ్ ప్రథమ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ప్రైవేట్ డిగ్రీ బీఈడీ కళాశాలల జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఈ మహాసభల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.
కడప నగరంలోని పిఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర మహాసభల కరపత్రాలను గాజుల శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న పిఆర్ఎస్ వైఎఫ్ ను అభినందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పిఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కన్నెలూరు శంకర్ మాట్లాడుతూ, మహాసభల్లో గత కార్యక్రమాల సమీక్షతో పాటు భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా నిరుద్యోగ భృతి రూ.3000, ఆడబిడ్డ నిధి కింద రూ.1500 అందించాలని, ఖాళీ లెక్చరర్, టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.











