జిల్లా: ఆదివారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మదనపల్లెలో ఏర్పాట్లను ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మదనపల్లెలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.
మదనపల్లె జడ్పీ హైస్కూల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, బాలికల కళాశాల పోలింగ్ బూత్‌లను డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కలిసి పరిశీలించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.





