మదనపల్లె, 28 June
మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకురాలు శ్రీమతి ఎన్. అనుషా రెడ్డి, ఎన్. శ్రీనాథ రెడ్డి దంపతుల కుమారుడు ఎన్. ఉజ్వల్ కృష్ణ రెడ్డి, తేజస్విని ఆర్య రెడ్డిల వివాహ రిసెప్షన్ మదనపల్లెలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మదనపల్లె ఇంచార్జ్ ఎస్ నిస్సార్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకురాలు శ్రీమతి ఎన్. అనుషా రెడ్డి, ఎన్. శ్రీనాథ రెడ్డి దంపతుల కుమారుడు ఎన్. ఉజ్వల్ కృష్ణ రెడ్డి, తేజస్విని ఆర్య రెడ్డి ఇటీవల వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారి వివాహ రిసెప్షన్ మదనపల్లెలో వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ శాసన సభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి, మదనపల్లె ఇంచార్జ్ ఎస్ నిస్సార్ అహమ్మద్, మాజీ పార్లమెంట్ సభ్యులు రెడ్డెప్ప తదితర నాయకులు వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సందడి చేశారు.
పార్టీ పరిశీలకురాలిగా మదనపల్లె నియోజకవర్గ పార్టీ వ్యవహారాల్లో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీమతి అనుషా రెడ్డి కుటుంబంలో జరుగుతున్న ఈ ఆనందోత్సవంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆత్మీయతను చాటుకున్నారు.











