బద్వేల్ పురపాలక సంఘం పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ ఎం. కృష్ణ ఆదేశించారు. ఈ మేరకు పురపాలక కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పురపాలక సంఘం పరిధిలోని వివిధ వార్డుల్లో ఇప్పటివరకు జరిగిన ఓటర్ల గుర్తింపు పురోగతిని అధికారులు సమీక్షించారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల వివరాలను పరిశీలించి, అధికారిక రికార్డులతో సమన్వయం చేసుకుంటూ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అర్హులైన ఓటర్ల వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితంగా నమోదు చేయాలని, పారదర్శకత పాటిస్తూ నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గుర్తింపు ప్రక్రియలో అలసత్వం వహించవద్దని, ప్రతి వార్డులోనూ క్షుణ్ణంగా సర్వే చేయాలని స్పష్టం చేశారు.





