రాజంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలిపారు.
రాజంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను విన్నవించుకుని అర్జీలు అందజేశారు. భూ సమస్యలు, పింఛన్లు, తాగునీరు, డ్రైనేజీ వంటి అనేక రకాల సమస్యలపై వచ్చిన వినతులను చమర్తి జగన్ మోహన్ రాజు క్షుణ్ణంగా పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తక్షణమే పరిష్కరించగల సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని అండగా నిలవడానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.











