సీపీఐ(ఎంఎల్) ఎర్ర సూర్యుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జల ఈశ్వరయ్య అస్వస్థతకు గురయ్యారు. హార్ట్ స్ట్రోక్‌తో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
కడప, దక్షిణ్ టైమ్స్ ప్రతినిధి: సీపీఐ(ఎంఎల్) ఎర్ర సూర్యుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి, కామ్రేడ్ గుజ్జల ఈశ్వరయ్య అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు వెంటనే వైద్య చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్‌కు తరలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నిన్న విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఈశ్వరయ్యకు చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించినట్లు సమాచారం.











