బిక్నూర్ మండలం తిప్పపూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక జరిగింది. రాష్ట్ర కార్యదర్శి బట్ట వెంకట్ రాములు, రాష్ట్ర మహిళా కార్యదర్శి సత్తిగారి లక్ష్మి, జిల్లా మహిళా అధ్యక్షురాలు బానపురం లావణ్య పర్యవేక్షణలో ఈ కమిటీ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది.
మందకృష్ణ మాదిగ నాయకత్వంలో, జిల్లా ఇన్చార్జి మంతెన సామిల్ మాదిగ సూచనల మేరకు తిప్పపురం గ్రామంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కొత్త కమిటీ అధ్యక్షులుగా నరిగళ్ళ రాజు, అధికార ప్రతినిధిగా భాను, ప్రధాన కార్యదర్శిగా బర్కరం రామ్, ఉపాధ్యక్షులుగా నరిగండ్ల ప్రశాంత్, కోటికల్లా రాజయ్య, ఇల్లందుల గణేష్, రవి ఇల్లందుల సురేష్ ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా రజనీకాంత్, భరత్ భీమయ్య దేవయ్య, సహాయ కార్యదర్శులుగా ఇల్లందులో ప్రేమ్ కుమార్, శ్యామకుర్తి గంగాధర్, ఇల్లందుల అనిల్, బర్కారం నారాయణ, రాజయ్య సామకుర్తి, మసూద్ నియమితులయ్యారు. ఈ ఎన్నికల కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు, మాదిగ కులస్తులు పాల్గొని కమిటీ ఎన్నికను విజయవంతం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










