జిల్లా పలమనేరు మున్సిపాలిటీ 32వ వార్డులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన ప్రసాద్ రెడ్డి, ఓటర్లను డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతూ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికల్లో గెలుపు కోసం అప్పులు చేసి డబ్బులు పంచానని, అయినా ఓటు వేయనివారు డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆయన హెచ్చరించారు.
ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ అభ్యర్థి ఓటర్లను డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరడం సంచలనంగా మారింది. జిల్లా పలమనేరు మున్సిపాలిటీ 32వ వార్డులో వైసీపీ తరపున ప్రసాద్ రెడ్డి అనే అభ్యర్థి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గెలుపు కోసం అప్పులు చేసి ఓటర్లకు డబ్బులు పంచినట్లు ఆయన స్వయంగా వీడియోలో చెప్పుకొచ్చారు. 10 లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఓటుకు వెయ్యి రూపాయల చొప్పున పంచాను. అయినా 400 మంది నాకు ఓటు వేయలేదు. డబ్బులు తీసుకుని ఓటు వేయని వారంతా నా డబ్బులు తిరిగి ఇవ్వండి. లేదంటే మీ ఇంటి వద్దకు వచ్చి కూర్చుంటాను అని ఆయన వీడియోలో హెచ్చరించారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. డబ్బులు పంచడం నేరమని తెలిసినా అభ్యర్థి బహిరంగంగా ఒప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

