సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి జరిగిన ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ఆర్మీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేష్ అక్రమ ఆయుధాల వ్యాపారులతో సంబంధాలు కలిగి ఉన్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అతనికి విదేశీ నెట్‌వర్క్‌లతో కూడా సంబంధాలున్నాయా అనే దానిపై ఆరా తీస్తున్నారు.
బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి అర్ధరాత్రి నాలుగు ఏకే-203 రైఫిళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, ఏడు పిస్టళ్లు, మందుగుండు సామగ్రి, నైట్ విజన్ పరికరంతో సహా పలు ఆయుధాలను దొంగిలించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఆయుధాలను నాగర్‌కర్నూల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాచినట్లు గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మాజీ ఆర్మీ హవల్దార్ మల్లేష్ 2009లో ఆర్మీలో చేరి ఆయుధాల నిర్వహణలో ప్రత్యేక శిక్షణ పొందాడు. సుమారు 16 ఏళ్లు సైన్యంలో పనిచేసిన అనంతరం 2020లో క్రమశిక్షణారాహిత్యం, సీనియర్ అధికారులతో విభేదాల కారణంగా విధుల నుంచి తొలగించబడ్డాడు. అతనికి గతంలో పశ్చిమ బెంగాల్‌లోని బరాక్‌పూర్‌లో పనిచేసే సమయంలో అక్రమ ఆయుధాల వ్యాపారులతో పరిచయాలు ఏర్పడినట్లు సమాచారం.











