ఢిల్లీలోని సంవిధాన్ సదన్ లో జరుగుతున్న 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో తెలంగాణ గొంతును బలంగా వినిపిస్తామని, రాష్ట్ర ప్రగతి, కీలక అంశాలను వివరిస్తామని ఆయన తెలిపారు.
ఢిల్లీలోని సంవిధాన్ సదన్ (పాత పార్లమెంట్ భవనం) లో ఈ రోజు, రేపు (26, 27 తేదీల్లో) జరుగుతున్న 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అంతకుముందు, ఈ రోజు ఉదయం తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాలకు బయలుదేరి వెళ్లారు.











