తెలంగాణ హైకోర్టు ఇచ్చిన దానం నాగేందర్ అనర్హత తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నికను తప్పించుకోవాలని చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి ఇది ఊహించని ఎదురుదెబ్బగా మారింది. హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌కు నిరాశే ఎదురైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పుతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.











