ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు, అందిన ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలన చేపట్టింది. ప్రిసైడింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది.
రాష్ట్రంలోని 92 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్ జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు, ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదన్న ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారుల నివేదికలను పరిశీలిస్తోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఫిర్యాదులపై విచారణ
పోలింగ్ సమయంలో వచ్చిన ఫిర్యాదులు, వెబ్‌కాస్టింగ్ దృశ్యాలు, ప్రిసైడింగ్ అధికారుల నివేదికలు, జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారుల సమాచారాన్ని పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఆధారాల ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసింది.
ఎన్నికల ఘటనలపై పోలీసుల దృష్టి
పోలింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించిన 41 ఘటనలపై పోలీసులు సమాచారం సేకరించి విచారణ చేపట్టినట్లు డీజీపీ వెల్లడించారు. ఫిర్యాదులను పరిశీలించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

