ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై. ఖురేషీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ చట్టబద్ధతపై అనుమానాలున్నాయని, దీనిని వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు. ఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణను ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. ఈ ప్రక్రియ చట్టబద్ధతపై అనుమానాలు ఉన్నాయని, దీనిని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ది డీలిమిటేషన్ డిబేట్: ది యూనియన్ అండ్ ఇట్స్ యూనిట్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జరిగిన చర్చలో ఖురేషీ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎన్నికల జాబితాల్లో అర్హులైన ఓటర్లు తప్పిపోకుండా, అనర్హులైన పేర్లు చేరకుండా చూడటం ఎన్నికల సంఘం బాధ్యతల్లో ఒకటని ఖురేషీ తెలిపారు. అయితే, ప్రస్తుతం చేపడుతున్న ప్రత్యేక సవరణలో అనుసరిస్తున్న విధానంపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఎన్నికల జాబితాల స్వచ్ఛత అవసరమే అయినప్పటికీ, దాన్ని సాధించే విధానం కూడా చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.











