సినీరంగంలో ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు చిత్రపరిశ్రమకు, భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.
వైవిధ్యమైన కథాంశాలను, వినూత్నమైన ఆలోచనలను తెరపై ఆవిష్కరిస్తూ తెలుగు సినిమాకు కొత్త దారులు చూపిన సృజనాత్మక దర్శకుడని స్మరించుకున్నారు. ప్రయోగాత్మకతకు పెద్దపీట వేస్తూ ఎన్నో చిరస్మరణీయ చిత్రాలను అందించిన సింగీతం శ్రీనివాసరావు గారు తనదైన ముద్రను సినీ చరిత్రలో శాశ్వతంగా వేశారని అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దర్శకుడిగానే కాకుండా రచయితగా, ఆలోచనాపరుడిగా, సినిమా పట్ల అపారమైన ప్రేమతో పనిచేసిన కళాకారుడిగా ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. సింగీతం శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ కళాభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.











