కడప
జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మూడు వేర్వేరు కేసుల్లో 9 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసి, 1.810 టన్నుల ఎర్రచందనం దుంగలను, అక్రమ రవాణాకు ఉపయోగించిన 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లావ్యాప్తంగా ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మన్నూరు, వీరబల్లి, ఖాజీపేట మండలాల పరిధిలో పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మన్నూరులో 42, వీరబల్లిలో 8, ఖాజీపేటలో 37 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 87 దుంగలు, 1.810 టన్నుల బరువున్న ఈ ఎర్రచందనాన్ని అక్రమ రవాణాకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.





