కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎన్నికల పరిశీలకుడు బి. అనిల్ కుమార్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి కర్నూలు నగర శివారులోని అథెనా పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని గురువారం పరిశీలించారు.
లెక్కింపు కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న స్వీకరణ కౌంటర్లు, ఎన్నికల సామగ్రి పంపిణీ విభాగాలు, బ్యాలెట్ పెట్టెలను భద్రపరిచే గదులు, ఓట్ల లెక్కింపు హాళ్లు, సిబ్బంది రాకపోకల మార్గాలను పరిశీలకుడు తనిఖీ చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ
పోలింగ్ సామగ్రి పంపిణీ, తిరిగి స్వీకరించే ప్రక్రియలో గందరగోళానికి తావులేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.











