ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై ఎన్నికల సంఘం, ప్రతిపక్షాల మధ్య వివాదం తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమంగా మార్పులు లేదా తొలగింపులు జరిగినట్లు నిర్ధారణ అయితే, ఆయనపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో సుమారు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఓటర్ల జాబితాలో అక్రమ మార్పులు చేయడం ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి వంటిదని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రభావితం చేస్తే, అది దేశానికి తీవ్రమైన నేరమని పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇటీవల ఎన్నికల కమిషన్‌లోని ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి.. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన నిర్ణయాలు, విధానాలపై గత పది నెలల్లో పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ ఓ మీడియా కథనం వెలువడింది. ఫారం-6, ఓటర్ల పేర్ల చేర్పులు, తొలగింపులు, ఎన్నికల సమాచార వ్యవస్థకు సంబంధించిన అంశాలపై ఈ అభ్యంతరాలు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.











