ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ సందర్భాల్లో అందిన జ్ఞాపికలు, కళాఖండాల ఈ-వేలం గడువును కేంద్ర సాంస్కృతిక శాఖ పొడిగించింది. 8వ విడత పీఎం మెమెంటోస్ ఈ-వేలంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకృతులు, శిల్పాలు, సంప్రదాయ హస్తకళలు, క్రీడా జ్ఞాపికలు తదితరాలను ప్రజల బిడ్డింగ్‌కు అందుబాటులో ఉంచారు. వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని నమామి గంగే కార్యక్రమానికి వినియోగించనున్నట్లు కేంద్రం తెలిపింది.
ఈ వేలంలో తెలంగాణకు చెందిన కాకతీయ కళాతోరణం వెండి ప్రతిరూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల నిర్మాణ వారసత్వానికి ప్రతీకగా గుర్తింపు పొందిన ఈ కళాతోరణం ప్రతిరూపానికి రూ.9 లక్షల ప్రారంభ ధర నిర్ణయించారు. నాటికి దీనికి రూ.10 లక్షల వరకు బిడ్ వచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో వేలంలో అత్యధిక బిడ్లు వచ్చిన వస్తువుల్లో ఇది మూడో స్థానంలో ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ విడత వేలంలో మొత్తం 1,498 జ్ఞాపికలు అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిలో కళాకృతులు, దేవతా విగ్రహాలు, సంప్రదాయ హస్తకళలు, క్రీడా జ్ఞాపికలు తదితరాలు ఉన్నాయి. తెలంగాణకు సంబంధించిన మరికొన్ని వస్తువులు కూడా వేలం జాబితాలో ఉన్నాయి.











