జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాడికి గురై తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని గోపికను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో పరామర్శించనున్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని, వైద్య చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు.
రాప్తాడు పాఠశాలలో శనివారం తరగతి గదిలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి కట్టెలు కోసే రంపంతో గోపికపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బాలికకు మెడ, పొత్తికడుపు సహా శరీరంలోని పలు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినికి కూడా గాయాలయ్యాయి. తొలుత లో చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం గోపికను బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
11 గంటలపాటు శస్త్రచికిత్స
ఆస్పత్రికి చేరుకునే సమయానికి గోపిక పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు పలు విభాగాల నిపుణులతో కలిసి సుమారు 11 గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించారు. రక్తస్రావాన్ని అదుపులోకి తీసుకొచ్చి, బాలిక ఆరోగ్య పరిస్థితిని స్థిరీకరించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమెకు పీడియాట్రిక్ ఐసీయూలో వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారు. కీలకమైన అవయవాల పనితీరును వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని బట్టి మరిన్ని శస్త్రచికిత్సలు అవసరమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
మంత్రి లోకేష్ పరామర్శ
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదివారం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి వెళ్లి గోపికను, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో భయాందోళనలకు గురైన విద్యార్థులకు మానసిక ధైర్యం కల్పించేందుకు 20 మంది కౌన్సెలర్ల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కూడా తెలిపారు.





