వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాసిన లేఖను వైఎస్సార్సీపీ విడుదల చేసింది. షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహాన్ని బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో నిర్వహించాలనే ప్రతిపాదనపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ లేఖ రాజకీయంగా, కుటుంబపరంగా చర్చనీయాంశమైంది.
భద్రత, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సమస్యల కారణంగా ఆ నివాసంలో పెళ్లి వేడుక నిర్వహించడం సాధ్యం కాదని జగన్ లేఖలో పేర్కొన్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. వివాహానికి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరవుతారని, క్యాటరింగ్, అలంకరణ, కార్యక్రమాల నిర్వహణ, ఫొటోగ్రఫీ, వీడియో చిత్రీకరణ వంటి పనుల కోసం అనేక మంది కొత్త వ్యక్తులు నివాసంలోకి వచ్చి వెళ్తారని వివరించినట్లు సమాచారం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వారి ద్వారా ఇంటి ప్రాంగణం, పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లే అవకాశం ఉందని, అది భద్రతాపరమైన సమస్యలకు దారితీయవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు కథనాలు పేర్కొన్నాయి. అంజలిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెంచానని, ఆమె వివాహం సంతోషంగా జరగాలని కోరుకుంటున్నానని జగన్ లేఖలో తెలిపినట్లు సమాచారం.











