గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై స్పష్టత వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.400 నుంచి రూ.600 వరకు తగ్గిందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఇది దేశవ్యాప్త ధరల తగ్గింపు కాదని ప్రభుత్వ చమురు సంస్థలు స్పష్టం చేశాయి.
దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయంటూ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ సాధారణ ధర కంటే రూ.400 నుంచి రూ.600 వరకు తక్కువకే లభిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు తగ్గాయా అనే సందేహం వినియోగదారుల్లో ఏర్పడింది. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం వేరుగా ఉంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రభుత్వ చమురు సంస్థలు దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను తాజాగా తగ్గించలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే గ్యాస్ ఏజెన్సీలు తమ వద్ద మిగిలిపోయిన వాణిజ్య సిలిండర్లను తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారం.











