రాష్ట్రంలో వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, మూడు నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం నిద్రలోనే ఉందని డాక్సిన్ టైమ్స్ విమర్శిస్తోంది. కరువుతో 628 మండలాలు అల్లాడుతున్నా, కరువు కార్యాచరణ చేపట్టడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటోంది.
కళ్ల ముందే పంటలు ఎండిపోతుంటే అన్నదాతలు నిస్సహాయంగా చూస్తుండిపోతున్నారని, ఉచిత పంటల బీమా పథకం కొనసాగి ఉంటే వారికి కొంత ఆర్థిక భరోసా లభించేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితిని ఎల్‌నినో ప్రభావంగా కాకుండా, ఎల్లోనినో ప్రభావంగా డాక్సిన్ టైమ్స్ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










