అండర్-19 ఆసియా కప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న కీలక పోరులో టీమిండియా టాస్ గెలిచింది. భారత కెప్టెన్ లక్ష్య రాజేశ్ రైచందాని టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ మస్కట్‌లోని అల్ అమేరత్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతోంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి పాకిస్థాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలని భారత యువ ఆటగాళ్లు భావిస్తున్నారు. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు పాకిస్థాన్ కూడా తన తొలి మ్యాచ్‌లో యూఏఈపై 9 వికెట్ల తేడాతో గెలిచి మంచి ఊపులో ఉంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
1. లక్ష్య రాజేశ్ రైచందాని (కెప్టెన్) 2. ఆర్యవీర్ సెహ్వాగ్ 3. అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్) 4. అర్జున్ రాజ్‌పుత్ 5. ఇషాన్ సూద్ 6. కావ్య పటేల్ 7. మనల్ చౌహాన్ 8. మోహిత్ ఉల్వా 9. యశ్వీర్ గౌడ్ 10. వీకే వినీత్ 11. యశ్వర్ధన్ చౌహాన్
1. ఉస్మాన్ ఖాన్ 2. జహంగీర్ బిలాల్ 3. అబ్దుల్ ఖాదిర్ 4. అహ్మద్ హుస్సేన్ 5. అలీ రజా 6. హంజా జహూర్ (వికెట్ కీపర్) 7. హస్నైన్ అబ్బాస్ దార్ 8. మహమ్మద్ సయ్యమ్ 9. ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్) 10. నిఖాబ్ షఫీక్ 11. రిజ్వానుల్లా
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
