భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు హైలో ఓపెన్ సూపర్ 500 టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. జర్మనీలోని సార్‌బ్రూకెన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు అద్భుత విజయం సాధించింది.
యూఏఈకి చెందిన ప్రకృతి భరత్‌పై వరుస గేముల్లో గెలిచి తదుపరి దశకు అర్హత సాధించింది. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు 21-10, 21-10తో ప్రత్యర్థిని సునాయాసంగా ఓడించింది. కేవలం 28 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఫ్రెంచ్ ఓపెన్ జోరును కొనసాగిస్తూ
ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో సింధు అద్భుత ప్రదర్శన చేసింది. పారిస్‌లో జరిగిన ఆ టోర్నీ ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న దక్షిణ కొరియా క్రీడాకారిణి ఆన్ సెయంగ్ చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది.












