హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబైకి బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై, విమానాన్ని అత్యవసరంగా తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించి ల్యాండింగ్ చేశారు.
ఎయిర్ ఇండియా విమానం ఏఐ 417 శుక్రవారం ముంబైకి బయలుదేరింది. విమానం గాల్లోకి ఎగిరిన సుమారు ఐదు నిమిషాలకే సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులకు సమాచారం అందించారు. వారి సూచనలతో విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ విమానంలో 109 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో ఎలాంటి గాయాల వివరాలు నివేదించబడలేదు.












