తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3.24 లక్షల కోట్లతో భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమర్పించిన ఈ బడ్జెట్లో సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలకు అధిక ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమర్పించిన బడ్జెట్లో మొత్తం వ్యయం రూ. 3,24,234 కోట్లుగా అంచనా వేయబడింది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2,34,406 కోట్లు, మూలధన వ్యయం రూ. 47,267 కోట్లుగా ఉంది. రెవెన్యూ మిగులు రూ. 6,857 కోట్లుగా అంచనా వేయబడింది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా కవరేజీ అందించేందుకు రూ. 4,000 కోట్లు కేటాయించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విద్యార్థుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ విద్యార్థులకు పౌష్టికాహార అల్పాహారం, ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా నగదు రహిత వైద్యం అందించేందుకు డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమాను గణనీయంగా పెంచారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 1.20 కోట్లు, విమాన ప్రమాదంలో మరణిస్తే రూ. 2 కోట్ల వరకు బీమా అందించబడుతుంది. పంచాయతీ రాజ్, విద్యా, వ్యవసాయం, నీటి పారుదల, వైద్యం, సంక్షేమ శాఖలకు భారీగా నిధులు కేటాయించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం రూ. 50,713 కోట్లు కేటాయించారు. రైతు భరోసా, చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకాలకు నిధులు కేటాయించారు. హైదరాబాద్ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ విప్లవం వంటి అంశాలకు కూడా ఈ బడ్జెట్లో ప్రాధాన్యతనిచ్చారు.









