కామారెడ్డి జిల్లా మండలం గజ్జ నాయక్ తండ గ్రామంలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు కొడుకులు ఉన్నా, తల్లి లక్ష్మి మాట విని భర్త కుమార్ తన భార్య వందనను వదిలేశాడు. కులం పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని బాధితురాలు వాపోతోంది.
గత ఏడు సంవత్సరాల క్రితం ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్న కొడియాల కుమార్, వందన దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. అయితే, కుమార్ తల్లి లక్ష్మికి క్యాన్సర్ ఆపరేషన్ జరిగినప్పుడు వందన పని మనిషిగా సేవలు చేసింది. కోలుకున్న తర్వాత, నువ్వు ఎస్సీ కులానికి చెందిన వ్యక్తివి, నా ఇంట్లో ఉండకూడదు అని అత్త, భర్త వేధించడం ప్రారంభించారు. కృష్ణా జిల్లా హనుమలంక గ్రామానికి చెందిన వందన, 2020లో కరోనా సమయంలో మెదక్లో ప్రేమించి, శివాలయంలో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. కామారెడ్డికి వచ్చి కాపురం చేసుకుంటున్నామని, తమకు రూతిక్ చారి (5), శివకుమార్ (4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారని ఆమె పేర్కొంది. తనపై జరుగుతున్న వేధింపులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వందన తెలిపింది. అయితే, ఎస్సై సమక్షంలోనే భర్త కుమార్ నీవు నాకు అవసరం లేదు, ఎక్కడికైనా వెళ్లిపో అని చెప్పి వెళ్లిపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లా ఎస్పీ తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి











