రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 25న మంత్రాలయం మండలం మాధవరం గ్రామాన్ని సందర్శించనున్న నేపథ్యంలో, నంద్యాల ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ పర్యటన కోసం సుమారు 500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని నియమించారు.
ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని, మంత్రాలయంలోని రివేరా ఫంక్షన్ హాల్లో భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ దిశానిర్దేశం చేశారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వాహన పార్కింగ్ ప్రాంతాలతో పాటు ఇతర కీలక ప్రదేశాలలో భద్రతా చర్యలను ఆయన సమీక్షించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పర్యటన సజావుగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతం కావడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆయన ఆదేశించారు.












