రంగారెడ్డి
దేశీయ వినియోగదారు ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రముఖ సంస్థ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను గణనీయంగా విస్తరించింది. జిల్లాలోని ఫ్యాబ్ సిటీలో రూ.200 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి, తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కొత్త కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సంస్థ తెలిపింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కొత్తగా ప్రారంభించిన ఈ కేంద్రం నెలకు ఐదు లక్షల ఇయర్‌బడ్స్, 75 వేల సౌండ్బార్లను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సంస్థ తన వివిధ వినియోగదారు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీతో పాటు, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను కూడా ఈ కేంద్రం నుండే నిర్వహించనుంది.





