పుత్తూరు / తిరుపతి జిల్లా (డాక్సిన్ టైమ్స్) జూన్ 27
తిరుపతి జిల్లా పుత్తూరు సబ్ డివిజన్లో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ మధుసూదన్ రెడ్డి, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, స్థానిక ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా పుత్తూరు సబ్ డివిజన్లో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్. ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) మధుసూదన్ రెడ్డి, ఐపీఎస్. , తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్. , పుత్తూరు ఎమ్మెల్యే భాను ప్రకాష్ , సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం , జిల్లా పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నూతన కార్యాలయ భవనాన్ని పరిశీలించిన రాష్ట్ర డీజీపీ, ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ కార్యాలయం ద్వారా పుత్తూరు సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
అనంతరం పుత్తూరు సబ్ డివిజన్ పోలీసు అధికారులతో రాష్ట్ర డీజీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మహిళలు, చిన్నారుల భద్రత, ప్రజలకు అందించే పోలీసు సేవల నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.











