Kurnool/Maddikera West (డాక్సిన్ టైమ్స్) జూన్ 28
జిల్లావ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు, రేపు నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను ఆయన రాయచోటిలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నేడు, రేపు (జూన్ 27, 28 తేదీలలో) నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కలెక్టర్ శనివారం రాయచోటి పట్టణంలోని పోలింగ్ స్టేషన్ నెం.121 పరిధిలో సందర్శించారు.
రాయచోటి అర్బన్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, బూత్ లెవల్ అధికారులతో (బిఎల్వో లు) మాట్లాడి ఓటరు కార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ, 'సర్' ఏన్యుమరేషన్ ఫారాల పంపిణీ, నమోదు ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికుల ఇండ్ల వద్దకు వెళ్లి నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. వివిధ అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు జారీ చేశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఓటరు జాబితాను మరింత ఖచ్చితంగా, సమగ్రంగా రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి చేరుకుని అర్హులైన ప్రతి ఓటరికి 'సర్' ఏన్యుమరేషన్ ఫారాలను అందజేయాలని, ఓటర్ల వివరాలను సక్రమంగా సేకరించి వెంటనే ఆన్లైన్లో డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల కుటుంబ వివరాలు, నివాస స్థితి, కొత్తగా వచ్చిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు.












