భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దుబాయ్‌లో మంగళవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె అగ్రస్థానానికి దూసుకువచ్చారు.
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో స్మృతి మంధాన అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఈ క్రమంలో ఆమె 790 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా బ్యాటర్ లారా వోల్వార్ట్ రెండో స్థానానికి పడిపోయారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 9వ స్థానంలో నిలవగా, మరో భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ 12వ స్థానంలో ఉన్నారు. బ్యాటింగ్ విభాగంలో భారత ఆటగాళ్ల ప్రదర్శన చెప్పుకోదగినదిగా ఉంది.










