టీ20 వరల్డ్ కప్ గ్రూప్-ఏలో భాగంగా పాకిస్థాన్, నమీబియా జట్ల మధ్య కీలక మ్యాచ్ కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. దీంతో నమీబియా జట్టు మొదట బౌలింగ్ చేయనుంది. తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో పాకిస్థాన్ ఈ మ్యాచ్‌ను ఎదుర్కొంటోంది.
టాస్ గెలిచిన అనంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా మాట్లాడుతూ, 'ఇక్కడ మేము ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడాం. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. భారీ స్కోర్ చేసి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నాం. వరల్డ్ కప్‌లో ప్రతి మ్యాచ్ కీలకమే. మా బ్యాటింగ్‌లో మెరుగుదల అవసరం ఉంది. యూఎస్ఏపై ఎలా ఆడామో, అదే తరహా ప్రదర్శన ఇక్కడ కూడా కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం' అని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మరోవైపు, నమీబియా కెప్టెన్ గెరహార్డ్ ఎరాస్మస్ మాట్లాడుతూ, 'ఇక్కడి వాతావరణం మాకు బాగా నచ్చింది. నమీబియాలో మేము అలవాటు పడ్డ వాతావరణమే ఇక్కడ ఉంది. మంచి టీ20 జట్టుగా మా పేరుకు తగ్గట్లుగా ఆడాలనుకుంటున్నాం. ఇప్పటివరకు కొన్ని మ్యాచ్‌ల్లో స్ట్రాంగ్ పోటీ ఇచ్చాం. కానీ బలమైన జట్లపై పూర్తి ఓవర్లు నిలకడగా ఆడాల్సి ఉంటుందని వెల్లడించారు.',










