ఛత్తీస్‌గఢ్ హాకీ లీగ్ () తొలి సీజన్ ఫైనల్లో మైన్‌పట్ టైటాన్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం రాయ్‌పూర్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ హాకీ స్టేడియంలో జరిగిన హోరాహోరీ పోరులో సంస్కార్ధాని స్ట్రైకర్స్‌ను 4-2 గోల్స్ తేడాతో ఓడించి టైటాన్స్ తొలి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌ను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ వీక్షించారు.
మ్యాచ్ ప్రారంభం నుంచే హోరాహోరీగా సాగింది. తొలి క్వార్టర్ చివరి నిమిషాల్లో మైన్‌పట్ టైటాన్స్ ఆటగాడు అభిషేక్ యాదవ్ రివర్స్ ఫ్లిక్ ద్వారా తొలి గోల్ సాధించి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రెండో క్వార్టర్లో సంస్కార్ధాని తరఫున ప్రజ్ఞాలద్ రాజ్‌భర్ గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. మూడో క్వార్టర్లో మైన్‌పట్ ఆటగాడు సందీప్ కుమార్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో జట్టు 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, సారిఖ్ అహ్మద్ గోల్ చేయడంతో స్కోరు మళ్లీ 2-2కు చేరింది.











