జిల్లా వాల్మీకిపురం సమీపంలో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జిల్లా వాల్మీకిపురం సమీపంలో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని 108 వాహనాల్లో వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











