రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న "ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు" కార్యక్రమాలలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి, రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
"ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక" కార్యాచరణలో భాగంగా నాలుగు రోజులపాటు ఈ రైతు ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం రైతుల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించడం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మే 22న సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో నూతనంగా నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి, రైతులకు అంకితం చేయనున్నారు. ఇది రాష్ట్రంలో పామాయిల్ ఉత్పత్తిని ప్రోత్సహించనుంది.










