డాక్సిన్ టైమ్స్ (డాక్సిన్ టైమ్స్) జూలై 08
ఖరీఫ్-2026, రబీ 2026-27 పంటల సీజన్లకు అమలు చేస్తున్న పంటల బీమా పథకాలను జిల్లాలోని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రైతులకు ఆర్థిక రక్షణ కల్పించేందుకే ఈ పథకాలు అమలులో ఉన్నాయని తెలిపారు.
ఖరీఫ్-2026, రబీ 2026-27 పంటల సీజన్లకు అమలు చేస్తున్న పంటల బీమా పథకాలను జిల్లాలోని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు పేర్కొన్నారు.
ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర అనుకోని కారణాల వల్ల పంటలకు కలిగే నష్టాల నుంచి రైతులకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం పంటల బీమా పథకాలను అమలు చేస్తోందని ఆయన తెలిపారు.
జిల్లాలో అర్హులైన రైతులు తమ ఆధార్, భూ వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, సాగు వివరాలతో సమీపంలోని గ్రామ, వార్డు సేవా కేంద్రాలు లేదా వ్యవసాయ శాఖ కార్యాలయాలను సంప్రదించి నిర్ణీత గడువులోగా బీమా నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు అనంతరం ఇచ్చే రసీదును తప్పనిసరిగా భద్రపరచుకోవాలని తెలిపారు.
ఖరీఫ్-2026 ఆహార పంటలకు ఈ ఏడాది ఆగస్టు 15 వరకు, వాణిజ్య, ఉద్యాన పంటలకు ఆగస్టు 31 వరకు బీమా నమోదు అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.












