గాంధారి, 14 September
మండల వ్యవసాయ అధికారి రాజలింగం, యూరియా సరఫరా గురించి ఆరా తీసిన రైతుతో దురుసుగా మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
యూరియా అడిగితే.. “ఎవడికి చేసుకుంటావో చేసుకో!” రైతుకు సమాధానం చెప్పాల్సిన ఏఓ.. దురుసుగా మాట్లాడినట్లు ఆరోపణ వ్యవసాయ అధికారి రాజలింగం తీరుపై రైతుల ఆగ్రహం.. సోషల్ మీడియాలో వైరల్‌గా (దక్షిణ్ టైమ్స్): యూరియా సరఫరా ఎప్పుడు జరుగుతుందో తెలుసుకునేందుకు ఫోన్ చేసిన ఓ రైతుతో మండల వ్యవసాయ అధికారి రాజలింగం దురుసుగా మాట్లాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుతో అధికారి మాట్లాడినట్లు ప్రచారంలో ఉన్న ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూరియా కోసం ఎదురుచూస్తున్న ఓ రైతు సరఫరా పరిస్థితిపై ఆరా తీసేందుకు ఏఓకు ఫోన్ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా రైతు అడిగిన ప్రశ్నలకు అధికారి “ఎవడికి చేసుకుంటావో చేసుకో” అంటూ సమాధానం ఇచ్చినట్లు ఆడియోలో వినిపిస్తోందని రైతులు పేర్కొంటున్నారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో వారికి భరోసా ఇవ్వాల్సిన అధికారే ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. వైరల్‌గా మారిన ఆడియోపై ఉన్నతాధికారులు స్పందించి వాస్తవాలను పరిశీలించాలని, రైతులకు యూరియా సరఫరాపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.











