దేశంలో వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.10 పెంచాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.2,810 నుంచి రూ.2,820కు చేరింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను వరుసగా మూడో నెల పెంచడం గమనార్హం. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్నపాటి టిఫిన్ సెంటర్లు, క్యాటరింగ్ వ్యాపారాలపై ఈ పెంపు ప్రభావం చూపనుంది. ఇప్పటికే వంట ఖర్చులు పెరిగిన నేపథ్యంలో తాజా ధరల పెంపు వ్యాపారులకు అదనపు భారంగా మారనుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రధాన నగరాల్లో కొత్త ధరలు
19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రధాన నగరాల్లో ఇలా ఉన్నాయి. ఢిల్లీ రూ.2,820, ముంబై రూ.2,774.50, కోల్‌కతా రూ.2,964, చెన్నై రూ.2,994.50, బెంగళూరు రూ.2,908.












