వైఎస్సార్ కడప జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. కడప నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
జిల్లాలో మొత్తం 560 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 4,39,035 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 6,20,650 బ్యాలెట్ పత్రాలు, 1,613 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశామని, ఇందులో 10 శాతం అదనపు నిల్వ కూడా ఉందని తెలిపారు. ప్రధాన అవసరానికి 5,63,981 బ్యాలెట్ పత్రాలు ఉండగా, అదనంగా 56,398 పత్రాలను సిద్ధంగా ఉంచారు. అలాగే 1,464 బ్యాలెట్ బాక్సులను అవసరానికి అదనంగా 149 బాక్సులను అందుబాటులో ఉంచారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి నాలుగు చొప్పున ఓటర్ల జాబితా ప్రతులు, బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ పెట్టెలతో పాటు ఎన్నికలకు అవసరమైన పత్రాలు, కవర్లు, బాణం గుర్తు రబ్బరు ముద్రలు, చెరగని సిరా తదితర సామగ్రిని అందజేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాల పరిశీలన











