కర్ణాటకలో నందిని పాల వినియోగదారులకు ధరల పెంపు ప్రభావం పడనుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ () పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పాల రకాన్ని బట్టి లీటరుకు 8 వరకు ధర పెరగగా, కిలో పెరుగు ధరపై 14 అదనపు భారం పడనుంది.
నందిని వివిధ రకాల పాల కొత్త ధరలు ఈ విధంగా ఉన్నాయి. టోన్డ్ మిల్క్ 1 లీటర్ ధర 46 నుంచి 54కు, హోమోజెనైజ్డ్ టోన్డ్ మిల్క్ 47 నుంచి 56కు, హోమోజెనైజ్డ్ కౌ మిల్క్ 50 నుంచి 58కు పెరిగాయి. స్పెషల్ టోన్డ్ మిల్క్, శుభమ్ మిల్క్ ధరలు 52 నుంచి 64కు చేరగా, హోమోజెనైజ్డ్ శుభమ్ ధర 53 నుంచి 65కు పెరిగింది. పాల ధరలతో పాటు నందిని పెరుగు ధరలను కూడా పెంచింది. 500 గ్రాముల పెరుగు ప్యాకెట్ ధర 28 నుంచి 34కు పెరిగింది. ఒక కిలో పెరుగు ధర 54 నుంచి 68కు చేరింది. దీంతో కిలో పెరుగు కొనుగోలుపై వినియోగదారులు అదనంగా 14 చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పాల ఉత్పత్తి ఖర్చులు పెరగడం, పశువుల దాణా ధరలు అధికం కావడం, మేత ఖర్చులు పెరగడం వంటి కారణాలతో పాల ధరలను పెంచినట్లు కథనం పేర్కొంది. పాడి రైతులకు మెరుగైన ఆదాయం అందించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని సమాచారం. రోజుకు ఒక లీటర్ పాలు కొనుగోలు చేసే కుటుంబానికి నెలకు సుమారు 240 అదనపు ఖర్చు అవుతుంది. అలాగే రోజూ ఒక కిలో పెరుగు కొనుగోలు చేస్తే నెలకు 420 అదనపు భారం పడుతుంది. ఈ ధరల పెంపు కర్ణాటకలోని నందిని బ్రాండ్ ఉత్పత్తులకు సంబంధించినది. తెలంగాణలోని ఇతర పాల బ్రాండ్లకు ఈ ధరలు వర్తించవు.












