రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. ఉక్రెయిన్‌లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సబ్స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని రష్యా మంగళవారం భారీ దాడులు జరిపింది. ఈ దాడుల కారణంగా రాజధాని కీవ్‌తో పాటు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ వెల్లడించిన వివరాల ప్రకారం, రష్యా 289 డ్రోన్లు, 17 బాలిస్టిక్ క్షిపణులు, 59 క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసింది. దక్షిణంలోని ఒడెసా నుంచి పశ్చిమంలోని రివ్నే వరకు విద్యుత్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఉక్రెయిన్‌కు చెందిన అతిపెద్ద ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థ డీటీఈకే () తెలిపిన వివరాల ప్రకారం, తమ ఐదు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మూడు కార్యకలాపాలు నిలిపివేశాయి. దీంతో కీవ్ సహా కనీసం ఆరు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రైల్వే వ్యవస్థపైనా దాడుల ప్రభావం పడింది. ప్రయాణికుల రైలు బోగీలు, లోకోమోటివ్‌లు, రైల్వే స్టేషన్ దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.












