శృంగవరపుకోట
విజయనగరం జిల్లాలో సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అనారోగ్యంతో ఉన్న తన 12 ఏళ్ల కుమార్తెను ఓ గిరిజన తల్లి దాదాపు ఏడు కిలోమీటర్లు భుజాలపై మోసుకెళ్లిన హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. రాజ్యసభ సభ్యుడు విజయ్ చింతకాయల ఆ గ్రామానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించేందుకు ముందుకు వచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మండలం పల్లపు దుంగాడ గిరిజన గ్రామానికి చెందిన సుంకరమ్మ కుమార్తె జన్ని సంపూర్ణ (12) అనారోగ్యానికి గురైంది. బాలిక నడవలేని స్థితిలో ఉండటంతో, గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో తల్లి ఆమెను భుజాలపై ఎత్తుకుని దాదాపు ఏడు కిలోమీటర్లు నడిచింది. రాళ్లు, గుట్టలు, వాగులు దాటుకుంటూ దబ్బగుంట సమీపంలోని రహదారి వరకు చేరుకుంది.












