జిల్లా మదనపల్లెలో దారుణ హత్య చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ లాడ్జిలో భార్యను భర్తే బీర్ బాటిల్తో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ముళబాగల్ కు చెందిన నవీద్ భాష అలియాస్ నవీన్ పాష తన భార్యతో కలిసి మదనపల్లెలోని ఓ లాడ్జిలో బస చేశాడు. గురువారం వారి మధ్య ఏదో విషయంలో ఘర్షణ జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
మాటామాటా పెరిగి ఆగ్రహానికి గురైన నిందితుడు అక్కడే ఉన్న బీర్ బాటిల్ ను పగలగొట్టి, ఆ ముక్కలతో భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది.












