జిల్లా మదనపల్లెలో సంచలనం సృష్టించిన లేడీ డాన్ కోనేటి సులోచనను పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అమాయకులను మోసం చేస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్న ఆమెపై ఇప్పటికే 14 కేసులు నమోదై ఉన్నాయి. దీంతో ఆమెపై రౌడీషీట్ కూడా తెరిచారు.
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టుపల్లికి చెందిన కోనేటి సులోచన గత కొంతకాలంగా మదనపల్లె పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూ వివాదాలు, చీటింగ్ కేసుల్లో ప్రధాన నిందితురాలిగా వ్యవహరిస్తోంది. తక్కువ ధరకు స్థలాలు ఇప్పిస్తామని నమ్మించి, అమాయకుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల బలవంతంగా భూములు ఆక్రమించుకున్న ఘటనలు కూడా ఉన్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
14 కేసుల్లో నిందితురాలు












